అపర చాణిక్యుడు వైఎస్ జగన్ >

అపర చాణిక్యుడు వైఎస్ జగన్ 


(ఎస్ ఎంఎం అలీ ,సీనియర్ ఎడిటర్ )


చాలామంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలియదు అంటుంటారు...కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసినంత రాజకీయం ఈతరం రాజకీయ నాయకులకు ఎవరికీ తెలియదు...40 ఇయర్స్ ఇండస్ట్రీని తప్పులో కాలేశాలా చేయడం అంత తేలికా??అసలు వస్తుందో రాదో తెలియని ప్రత్యేక హోదా పోరాట ఫలాలు తానే(జగన్) తినబోతున్నానని అపర చాణక్యుడు చంద్రబాబును నమ్మిచడం సాధారణ విషయమా??


సరిగ్గా జగన్మోహన్ రెడ్డి ఇక్కడే వేశాడు నిఖార్సయిన ఉచ్చు...వస్తే కొండ పోతే వెంట్రుక అన్న చందాన.ప్రత్యేక హోదా దీక్ష చేద్దాం...ఎలానూ రాదు...కానీ ప్రజల్లో క్రేజ్ వస్తుంది.ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి బీజేపీని తిట్టొచ్చు...మేం పోరాడాం...కానీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై హోదా అంశాన్ని కాలరాశారు అని ప్రజలకు చెప్పుకోవచ్చు ఇదీ వైసీపీ రాజకీయ వ్యూహం... కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి...ప్రతిపక్ష పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేయాలి...కానీ నవ్యాంధ్రలో విజన్ ఉన్న నాయకుడు,ఆయన పరివారం,ఆస్థాన పత్రికలు,ఛానెళ్లు అందరూ కలిసి ప్రతిపక్ష పార్టీ వేసిన ప్రత్యేక హోదా అనే ఉచ్చును ప్రతిపక్ష పార్టీ మెడకే తగిలించాలన్న సింపుల్ లాజిక్ ని మర్చిపోయి సరిగ్గా వెళ్లి ఆ ఉచ్చు మధ్యలో ఇరుక్కున్నారు.పైపెచ్చు ప్రతిపక్ష పార్టీ కి ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రాన్ని వీళ్ళేదో లాగేసుకున్నట్టు ఓ తెగ ఫీలైపోయారు.


ఇహ మొదలేశారు...స్టేజీలు,టెంట్లు,కూలర్లు,ఏసీలు అబ్బో ఒకటేమిటి మయుసభను తలదన్నేలా అమరావతి గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ కి చెందిన ఆర్ట్ డైరెక్టర్ల అద్భుతమైన సెట్టింగులతో ధర్మ పోరాట దీక్షలు...ఎక్కడి దీక్షా వేదికపైనైనా ఒకటే స్క్రిప్ట్...బీజేపీతో కలవడం చారిత్రాత్మక తప్పిదం...ఇదే అపర చాణక్యుని పతనానికి మొదటి సోపానం...మొగుడు ముండ అన్నాడని ముష్టికొచ్చినోడు కూడా ముండ అన్నాడట...40 ఇయర్స్ ఇండస్ట్రీ వీరుడు కదా...ప్రధానమంత్రి కంటే సీనియర్ కదా తిడితే తిట్టాడులే అనుకుంటే పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీతో కూడా భారత ప్రధానమంత్రిని తిట్టించడం మొదలేశారు విజన్ ఉన్న పార్టీ నాయకులు.


పోనీలే ఇక్కడితో అయిపోయిందా అంటే...అబ్బే అలా ఎలా??ప్రధాని మోదీ ని ఇంటికి పంపే మొనగాడ్ని నేనే అంటూ కర్ణాటకలో తన వంతు కర్తవ్యం నిర్వహించారు బాబు.నా ప్రచారం వల్లనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని ప్రెస్ మీట్లు...సీన్ కట్ చేస్తే మరో అసలైన చారిత్రక తప్పిదం...తెలుగువాడి ఆత్మ గౌరవ పార్టీని హస్తినలో "హస్త"వాసి సరిగా లేని హానికరమైన పార్టీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశారు దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు.


తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నాడంట వెనకటికి ఓ ప్రబుద్ధుడు...స్వతంత్ర భారత చరిత్రలో అరుదుగా జరిగే అద్భుతమైన మెజార్టీతో గెలిచిన అత్యంత శక్తివంతమైన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి,అత్యంత తక్కువ రాజకీయ అనుభవం కలిగిన యువకుడు జగన్మోహన్ రెడ్డి వేసిన ఉచ్చులో పడి పొత్తు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించి ఇంటా,బయటా నవ్వులపాలైన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అధినేత తాజా పరిస్థితిని చూస్తుంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలియదని అనగలమా???


రాజకీయాలలో హత్యలు ఉండవ్...ఆత్మహత్యలే ఉంటాయ్...ప్రత్యర్థి పార్టీ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడమే అసలు సిసలైన నేటి రాజకీయం
🙏🙏🙏